చిరంజీవి ని పట్టించుకోని రజినీకాంత్??

టాలీవుడ్ లో “బి ద రియల్ మాన్” ఛాలెంజ్ ని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేశాడు. అది రాజమౌళి చేతుల మీదుగా బాగా వైరల్ అయింది. అప్పటి నుండి అదొక చైన్ లాగా ఒకరినొకరు ఛాలెంజ్ చేస్తూ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ ఛాలెంజ్ లో కొందరు సీనియర్ హీరోలు మాత్రం ఇంకా పార్టీసిపెట్ చేయలేదు. ఆ కథేంటో చూద్దాం..

మెగాస్టార్‌ చిరంజీవి కి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్ మొదటి నుండి మంచి స్నేహితులు. ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌లో భాగంగా, రజనీకాంత్‌ని నామినేట్‌ చేశారు చిరంజీవి. కానీ, టాలీవుడ్‌ మెగాస్టార్‌ విసిరిన ఛాలెంజ్ కి తమిళ సూపర్‌ స్టార్‌ ఇంకా స్పందించకపోవడం మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మామూలుగానే రజినీకాంత్ కి పబ్లిసిటీ అంతగా నచ్చదు. ఆ విషయం అందరికీ తెలిసిందే అయినా ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారేమో అని చాలా మంది ఎదురు చూశారు.

మరోపక్క, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నామినేట్‌ చేసిన వారిలో బాబాయ్ బాలయ్య, అక్కినేని నాగార్జున ఇంకా రియాక్ట్ కాలేదు. నిజానికి ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ జస్ట్‌ ఫర్‌ ఫన్‌ కోసం కాదు, జీవితాంతం ఇంటి పనులు చేస్తూ మనకి కష్టం కలగకుండా చేసుకునే ఆడవారి కి మన వంతు తోడుగా ఉండాలనేది ఈ ఛాలెంజ్ లక్ష్యం. లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరికి తమ తల్లి లేదా భార్యలకు ఇంటి పనుల్లో తోడుగా ఉండేందుకు ఈ టైమ్ బాగా కలిసి వచ్చింది. ఈ పనులు కొంతమంది మగవారు తమ ఇళ్లలో చేసేవే కానీ చాలా వరకు ఇలాంటి పనులకు దూరంగా ఉంటారని మనందరికీ తెలుసు.

అయితే ఈ చాలెంజ్ విషయానికి వస్తే రజనీకాంత్‌ స్పందించలేదనో, బాలయ్య, నాగ్‌ లైట్‌ తీసుకున్నారనో అనుకోవడానికి వీల్లేదు. ముందు ముందు వాళ్ళ స్పందనలూ ఇంకాస్త కొత్తగా రాబోతున్నాయేమో. అది ఇప్పుడే చెప్పలేం. చిరంజీవితో కలిసి రజనీకాంత్‌ ఈ మధ్యనే సెల్ఫీ వీడియో ద్వారా ఓ ఇంట్రెస్టింగ్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం చేశారు. అందులో ఇంకొంత మంది నటులు కూడా ఉన్నారు. నాగార్జున కూడా సంగీత దర్శకుడు కోటి, ‘కరోనా వైరస్‌’పై రూపొందించిన పాటలో కన్పించారు.

నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కరోనా సహాయనిధికి విరాళం ప్రకటించడంతోపాటుగా, ఆయన తల్లిగారి పేరుతో నడుస్తున్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో పేషేంట్లకి ఏ కష్ట కాలంలో మరింత అండగా ఉంటూ సహాయం చేస్తున్నారు.

ఇలా ఎవరు చేయగలిగింది వారు చేస్తున్నారు. ఇవి కూడా ఛాలెంజ్ లే కదా!!

Likes:
0 0
Views:
617
Article Categories:
Mastiday ExclusivesMovie News

Comments are closed.