తన జిమ్ వీడియోతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ !!

కంచె లాంటి పీరియడ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.. కానీ ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ పెద్దగా రాలేదు. అందం ఉన్నా అదృష్టం లేనట్లు అయింది ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి. ‘కంచె’ లాంటి మంచి సినిమాలో నటించినా ఆమెకి అవకాశాలు రాకపోతే ఇంకేం అనుకోవాలి మరి.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్, క్రిష్ ల
సినిమాలో ఏదో పాత్ర వచ్చిందని అన్నారు కానీ నిజమో కాదో ఇంకా తెలియలేదు. సినిమా రెగ్యులర్ షూట్ మొదలైతే కానీ ఆ విషయం మీద ఒక క్లారిటీ రాదు.. అయితే ఒకదాన్నే నమ్ముకుని కూర్చోవడం ఎందుకనుకుందో ఏమో.. కొత్త దారిలో వెళ్లాలని డిసైడయ్యింది ప్రగ్య. ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. తన చానెల్ లో ఫుడ్, హెల్త్, ట్రావెల్, ఫిట్ నెస్ , యోగా వంటి
మంచి మంచి విషయాల్ని చూపిస్తుందట. ‘మీరు చూసి ఊరుకోకండి. అందరికీ షేర్ చేయండి, సబ్ స్క్రైబ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. నిజానికి లాక్ డౌన్ మొదలయ్యాక చాలామంది సొంత యూట్యూబ్ చానెల్స్ పెట్టారు. కొందరు యోగా పాఠాలు చెబుతున్నారు. మరికొందరు వంటలు నేర్పిస్తు న్నారు. ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తున్నాడు ఇప్పుడు ప్రగ్య కూడా అదే పని చేసింది.

ఇప్పటికే కొన్ని ఫుడ్ వీడియోస్ యు ట్యూబ్ లో అప్లోడ్ చేసింది.. అదే కాకుండా జిమ్ లో కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్న వీడియో తో ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తోంది.. ఈ వీడియో పై ఫాన్స్ నుండి హాట్ కామెంట్స్ కూడా అందుకుంది ప్రగ్యా.. ముందు ముందు ఎలాంటి వీడియోస్ పెడుతుందో చూడాలి!

Likes:
0 0
Views:
897
Article Categories:
UncategorizedViral

Comments are closed.